TANTEX: డెంటన్ కమ్యూనిటీ షెల్టర్ వద్ద టాంటెక్స్ ‘అన్నదాత సుఖీభవ’.. ఆకలి తీర్చేందుకు తెలుగు వారి ముందడుగు!
TANTEX: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సామాజిక బాధ్యతతో మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ఫిబ్రవరి 28, 2026 శనివారం నాడు డెంటన్ కమ్యూనిటీ షెల్టర్ వద్ద ఆహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కార్యక్రమ వివరాలు:
- సమయం: మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 6:00 గంటల వరకు.
- వేదిక: డెంటన్ కమ్యూనిటీ షెల్టర్ (Denton Community Shelter), TX-288 N Loop, Denton, TX 76209.
- సమన్వయకర్తలు: శివ రెడ్డి వల్లూరు, పవన్ నర్ర ఈ కార్యక్రమ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
అల్పాహారం, భోజన వితరణ ద్వారా స్థానిక నిరాశ్రయులకు అండగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.






