Sai Krishna: బుల్లిరాజు ఇండస్ట్రీకి వచ్చింది నా వల్లే
సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) మూవీలో బుల్లిరాజు(bulli raju) పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(Revanth). ఆ మూవీలో రేవంత్ కామెడీని నవ్వని ఆడియన్స్ లేరంటే అతిశయోక్తి లేదు. అందుకే ఆ మూవీ తర్వాత రేవంత్ చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. వచ్చిన అవకాశాలను అందుకున్న రేవంత్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు.
ఇప్పుడు రేవంత్ కీలక పాత్రలో హై(High) అనే మూవీ రాబోతుంది. అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ మరియు అతని వద్ద అసిసోయేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సాయి కృష్ణ(Sai krishna) ఈ మూవీకి డైరెక్టర్. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ లాంచ్ చేస్తూ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా, టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో బుల్లిరాజు అలియాస్ రేవంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు సాయి కృష్ణ.
అసలు బుల్లిరాజును ఇంట్రడ్యూస్ చేసింది తానేనని, ఆ పిల్లాడిని ఓ వీడియోలో చూసి సెలెక్ట్ చేసి ఇండస్ట్రీకి తీసుకొచ్చిందని తానే అని, అలాంటి అబ్బాయి క్రేజ్ ను తన సినిమా కోసం వాడుకోపోతే ఎలా అని హై మూవీలో తీసుకున్నానని, ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలకు భిన్నంగా ఈ మూవీలో బుల్లిరాజు పాత్ర ఉంటుందని, ఆ క్యారెక్టర్ ను చాలా కొత్తగా డిజైన్ చేసినట్టు సాయి కృష్ణ తెలిపాడు.
https://x.com/idlebraindotcom/status/2020840891905413400?s=20













