Nara Lokesh: లోకేష్ ను చూసి షాక్ అయిన ఎమ్మెల్యేలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలతో పాటుగా, అసెంబ్లీ(Budget Session) వర్గాల్లో ఇప్పుడు మంత్రి నారా లోకేష్ హాట్ టాపిక్ అయ్యారు. గతంలో విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు లోకేష్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా టిడిపి సీనియర్ నేతల విషయంలో లోకేష్ అనుభవిస్తున్న వైఖరి, తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు కూటమిలోని ఇతర పార్టీలలో కూడా చర్చకు దారి తీస్తోంది. మంత్రిగా శక్తివంతమైన స్థానంలో ఉన్న లోకేష్.. ఇప్పుడు సీనియర్ నేతలకు, అలాగే పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తన టీం ను తాను బిల్డ్ చేసుకుంటూనే.. సీనియర్ నేతల సహకారంతో ముందుకు వెళ్తున్నారు. టిడిపి భవిష్యత్తు నాయకుడిగా ఉన్న లోకేష్.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, పార్లమెంట్ల వారీగా ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరమైన సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఎమ్మెల్యేలతో చర్చ ఉండే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu)తో లోకేష్ అనుసరించిన వైఖరి కాస్త హాట్ టాపిక్ అయింది.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీని రేపటికి వాయిదా వేసిన సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆయన కారు వద్దకు వెళ్ళిన లోకేష్ వీడ్కోలు పలకడం సంచలనమైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ముందు నుంచి అయ్యన్నపాత్రుడు విషయంలో సన్నిహితంగా ఉండే లోకేష్.. ఇప్పుడు ఆయనను స్వయంగా కారు ఎక్కించేందుకు రావడం అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు చూసి షాక్ అయ్యారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి













