Sridhar Babu: హైదరాబాద్ లో యూబీఎస్ విస్తరణ : మంత్రి శ్రీధర్ బాబు
స్విట్జర్లాండ్‌కు (Switzerland) చెందిన అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ (UBS) హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించిది. గచ్చిబౌలిలో అత్యాధునిక హంగులతో కూడిన నూతన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీని) లాంఛనంగా ప్రారంభించింది. భారత్‌లో తన దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, రానున్న రెండేళ్లలో దాదాపు 3,000 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.కొత్త కేంద్రం ఏర్పాటుతో అత్యున్నత స్థాయి ఫైనాన్షియల్ టెక్నాలజీ, జీసీసీ కార్యకలాపాలకు హైదరాబాద్ ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు పుణె (Pune), నవీ ముంబయి, హైదరాబాద్‌లలో కార్యాలయాలున్నాయి. కత్రిమ మేధ వంటి అభివద్ధి చెందుతున్న రంగాల్లో పనిచేయడానికి హైదరాబాద్‌లోని ఈ కొత్త కార్యాలయం అదనపు వేదికను కల్పిస్తుందని కంపెనీ వెల్లడించింది.నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్థిక సంస్థలకు హైదరాబాద్ ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. బీసీసీల కోసం తెలంగాణ బలమైన ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తోంది. యూబీఎస్ ఇక్కడ కార్యకలాపాలను మరింత విస్తరించడం, గ్లోబల్ టాలెంట్, ఇన్నోవేషన్ హబ్‌గా నగరంపై ఉన్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తోందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













