Home Minister Anita:అందుకే వైసీసీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారు : హోం మంత్రి అనిత
వైసీపీ (YCP) నేతలు గవర్నర్ ను అవమానించేందుకే అసెంబ్లీకి వచ్చి, వారి ఎజెండాను పూర్తి చేసుకొని వెళ్లిపోయారని రాష్ట్ర హోం మంత్రి అనిత (Home Minister Anita) విమర్శించారు. ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏదైనా అన్యాయం జరిగితే గవర్నర్‌ను (Governor) కలిసి తెలియజేస్తుంటామని చెప్పే పెద్ద మనుషులు, అసెంబ్లీ (Assembly)లో ప్రసంగిస్తుంటే గవర్నర్‌పై కాగితాలు విసిరి అవమానించేలా వ్యవహరించడం ఎంత వరకు సమంజమని ఆమె ప్రశ్నించారు. మూడు నెలల్లోపు సభకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దువుతుందనే కాన్సెప్ట్ నడుస్తోందని, ఈ విషయంలో స్పీకర్ కఠినంగా ఉన్నారని, ఆ సమస్య రాకుండా షో చేసేందుకు వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చినట్లు ఉందని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













