Minister Lokesh: ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోం : మంత్రి లోకేశ్
రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేసిందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలి (Legislative Council)లో వాడీవేడీ చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేశ్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ క్రెడిబులిటీ ఉన్న ఐదు సంస్థలకే 99 పైసల చొప్పున భూములు కేటాయించామని, ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోమని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే 18 నెలల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు రానుందని, దీనికి భూములు కేటాయించామని అన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ (Cognizant) వంటి సంస్థలకు భూములు ఇవ్వడం తప్పా? అని నిలదీశారు. వైసీపీ పాలనలో విశాఖ (Visakhapatnam)కు కనీసం ఒక్క కంపెనీ అయిన తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.













