TACO : మేరీస్ విల్లేలో ఫిబ్రవరి 15న ‘టాకో’ ఆధ్వర్యంలో క్యారమ్స్ టోర్నమెంట్
TACO : సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం (TACO) ఆధ్వర్యంలో 2026 క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 15వ తేదీ, ఆదివారం ఉదయం 9:00 గంటలకు మేరీస్ విల్లేలోని ‘రోలింగ్ మెడోస్ గోల్ఫ్ కోర్స్ క్లబ్’ (Rolling Meadows Golf Course Club) లో ప్రారంభం కానుంది.
ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యవర్గ బృందం పర్యవేక్షిస్తోంది. టోర్నమెంట్ వివరాల కోసం ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.
- శ్వేత మన్నె: (614) 468-3668
- రామభద్ర రాజు: (682) 313-0251
- సత్య మర్రె: (614) 329-3925
- యశ్ కోసన: (816) 616-6964
- తేజ ఎదర: (669) 226-1564
ఫీజు వివరాలు: పిల్లలకు $5 ప్రవేశ రుసుము ఉండగా, పెద్దలలో టాకో సభ్యులకు $10, సభ్యత్వం లేని వారికి $20 గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్, చెల్లింపుల కోసం treasurer@tacosite.com అనే జెల్లీ (Zelle) ఐడిని ఉపయోగించాలని నిర్వాహకులు కోరారు.
స్థానిక తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ క్రీడా వేడుకను జయప్రదం చేయాలని మేనేజ్మెంట్ కమిటీ కోరుతోంది.













