The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
నేచురల్ స్టార్ నాని మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హాటెస్ట్ పాన్-ఇండియన్ రిలీజెస్ లో ఒకటిగా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జోరుగా సాగుతుండగా, నిర్మాతలు ఇప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
‘ది ప్యారడైజ్’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ సినిమాకు వరుసగా మూడు వారాల పండుగలు కలిసిరానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్-ఉన్-నబీ పండుగలు మధ్యలో రావడం, రెండో వీకెండ్లో రాఖీ బంధన్, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్ స్పెక్టకిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. ప్లానింగ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని, ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెట్ సెన్స్‌ని చూపించారు.
ప్రస్తుతం టీమ్ చిత్రంలోని హైలైట్లలో ఒకటైన నాని ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించగా, నాని రా ఎనర్జీకి సరిపోయేలా రూపొందిస్తున్నారు. కోరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్‌తో ఈ సాంగ్‌ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు.
ది ప్యారడైజ్‌లో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు వంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటుండగా, నాని ఫియర్స్ ‘జడల్’ లుక్‌తో విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై ఉన్న ఎక్సైట్మెంట్ను మరింత పెంచింది.
ఈ చిత్రానికి సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్ విడుదల కానుంది.













