Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్గా అనిపించింది – విశ్వక్ సేన్
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ లో బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి: డైరెక్టర్ తరుణ్ భాస్కర్
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ రోజు మేకర్స్ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ వేడుకకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ…ఈ సినిమా టీజర్ ENE సెట్లో శ్రీనాథ్ చూపించాడు. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ టీంలో నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ కి నేను. పెద్ద ఫ్యాన్ ని ఆయన విరాటపర్వం నాకు చాలా ఇష్టం. శ్రీనాథ్ చాలా సున్నితమైన మనిషి. ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో కూడా అద్భుతంగా చేశాడు. తప్పకుండా తను అందరినీ అలరిస్తాడు. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి రూటెడ్ కథలు తగ్గాయి. ఇప్పుడు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరి పర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయి. శ్రీనాథ్ టైం వచ్చిందని అనిపిస్తోంది. తనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకి అన్ని కుదురాయి అనిపిస్తోంది. మార్చి 6న తప్పకుండా ఈ సినిమా చూడండి. బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. నెక్స్ట్ డే సినిమా రిలీజ్ పెట్టుకున్న హీరో విశ్వక్ గారు మరో సినిమా ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా నేను రెండుసార్లు బ్యాక్ టు బ్యాక్ చూశాను. నాకు సినిమా చాలా నచ్చింది. ఈ సినిమా మీద నాకు చాలా గౌరవం ఉంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా ప్యాషన్ తో చేశారు. చాలా కష్టపడి ఈ సినిమాని మార్చి 6 రిలీజ్ కి తీసుకొస్తున్నారు. సినిమా తప్పకుండా జనాల్లోకి బాగా వెళుతుంది. మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరో హీరోయిన్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను
హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి టాప్ హీరో మా డైరెక్టర్. ఆయన చాలా బలంగా నన్ను ముందుకు తీసుకొచ్చారు. మా డిఓపి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి సూపర్ స్టార్ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాజేష్ గారు ఈ సినిమా కోసం ఒక పోరాటమే చేశారు. ఆయన నన్ను బలంగా నమ్మారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. గాయత్రీ చాలా అద్భుతంగా పెర్ఫాం చేసింది. తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్సేన్ గారు ఎంతో గొప్ప మనసుతో ఈ వేడుకకి వచ్చారు. నాకు ఎంతో గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మైత్రి ఈ సినిమాని నైజంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వారి నమ్మకం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకాన్ని ఇచ్చింది. అలాగే ధీరజ్ గారు ఆంధ్రలో రిలీజ్ చేస్తున్నారు. ఆయన హ్యాండ్ మా సినిమా మీద ఉండడం ఇంకా బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా గెలవాలి మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నిలబడాలి. వాళ్లతో పాటు నేను కూడా నిలబడతాను. అందరికీ థాంక్యూ సో మచ్.
హీరోయిన్ గాయత్రి రమణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని . ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు కాల్ వచ్చింది. అలా ఈ సినిమా నాకు వచ్చింది. ఈ సినిమా నాకు రావడానికి డైరెక్టర్ శైలేష్ గారు ఒక ముఖ్య కారణం. అలాగే డైరెక్టర్ బాల గారు నన్ను ఈ పాత్రకి ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. విశ్వక్ గారికి తరుణ్ భాస్కర్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో నాకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది
డైరెక్టర్ బాల సతీష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ సో మచ్. విశ్వక్ గారు, తరుణ్ భాస్కర్ గారు రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ధీరజ్ గారు ఈ సినిమాని రెండుసార్లు చూశారు. ఆయన రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు మాకు ఎంతో నమ్మకం కలిగింది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ థాంక్ యూ.
ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ. బిజీ షెడ్యూల్లో ఈవెంట్ కి వచ్చిన విశ్వక్ గారికి తరుణ్ భాస్కర్ గారికి థాంక్ యూ. ఒక మంచి జెన్యూన్ కంటెంట్ తో ఈ సినిమా చేశాం. అందరూ ఈ సినిమాని బ్లెస్ చేస్తారని, ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను.













