SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
ప్రేక్షకులకి వేలంటైన్స్ డే విషెస్ చెబుతూ.. ఫిబ్రవరి 13 న “స్కై” మూవీని మేకర్స్ ధియేటర్ రిజీజ్ చేస్తున్నారు. మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రదాన పాత్రల్లో, పృధ్వీ పేరిచర్ల డైరెక్షన్లో వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ పతాకం పై నిర్మిస్తున్న ఈ “స్కై” మూవీకి ప్రఖ్యాత సినీమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సీనియర్ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ అందిచారు. నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పేరిచర్ల సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ స్కై మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్న శివప్రసాద్ కంపోస్ చేసిన సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ చెప్తున్నారు. రేపు, ఫిబ్రవరి 13 న రిలీజ్ కాబోతున్న ఈ “స్కై” మూవీ కూడా ప్రేక్షకులందరినీ ఖచ్చితంగా అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.













