వైఎస్ జగన్తో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ
సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ తే చియాంగ్ (Edgar Pang Te Chiang) మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి(Y.S. Jagan Mohan Reddy) తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ సమావేశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం నారా లోకేష్ (Nara Lokesh,)తో వీరు సమావేశం అయ్యారు. మంగళవారం జగన్ తో సమావేశం అయ్యారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి (Amaravati) ప్రాజెక్టుల పునరుద్ధరణపై సింగపూర్ ప్రతినిధులు ఒకవైపు చర్చలు జరుపుతున్న తరుణంలో, ప్రతిపక్ష నేతతో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రత్యేకంగా సమావేశమవ్వడం వెనుక అంతరార్థం ఏంటనే దానిపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.








