19వ ఆటామహాసభల వేదికపై ‘వీవ్స్ ఆఫ్ సిల్క్’ఫ్యాషన్ షో.. జూన్ 30 రిజిస్ట్రేషన్ చివరి గడువు
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో 2026, జులై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో 19వ ఆటా మహాసభలు , యువజన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ మహాసభల్లో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చనా కోచ్చర్ సమర్పణలో ‘వీవ్స్ ఆఫ్ సిల్క్’ (Weaves of Silk) అనే పేరుతో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించనున్నారు.
వివరాలు..
ఈ సాంస్కృతిక ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు 18 సంవత్సరాలు పైబడిన యువతీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30, 2026లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అందుబాటులో ఉన్న క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేయవచ్చు లేదా మరిన్ని వివరాల కోసం ataconventionfashionshow@gmail.com కు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.








