జూన్ 21 న TANTEX నేలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు
TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘నేలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య వేదిక 227వ మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం జూన్ 21, 2026, ఆదివారం రోజు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు శ్రీ పారుపల్లి కోదండరామయ్య ముఖ్య అతిథిగా హాజరై ‘తెలుగుదేల యన్న…’ అనే అంశంపై ప్రసంగించనున్నారు.
కార్యక్రమ వివరాలు..
ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2:30 నుండి 5:30 గంటల వరకు (CST), లెవిస్విల్లేలోని 2681 MacArthur Blvd, Suite#204 వేదికగా జరుగుతుంది. సాహిత్య ప్రియులు జూమ్ (Zoom) లింక్ https://bit.ly/3svKJbo, మీటింగ్ ఐడి 788 250 6018, పాస్కోడ్ 432781 ద్వారా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వారందరూ ఈ ప్రత్యేక సాహిత్య వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.








