డి అన్నంలో కాస్త నెయ్యి, ఘాటైన బోటి గోంగూర కలిపి తింటుంటే వచ్చే ఆ తృప్తే వేరు. నాన్-వెజ్ ప్రియులకు ఇదొక పెద్ద ఎమోషన్!
హైదరాబాద్ నవాబీ మసాలాల ఘాటు, ఆంధ్రా స్వచ్ఛమైన ఎర్ర గోంగూర పులుపుల కలయికే ఈ బోటి గోంగూర స్పెషల్ కర్రీ.
శుభ్రం చేసిన బోటి, ఫ్రెష్ గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఘాటైన గరం మసాలా.
బోటి వంటకానికి క్లీనింగ్ చాలా ముఖ్యం. వేడి నీళ్లలో ఉప్పు, పసుపు వేసి, బోటిని 3-4 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
కడిగిన బోటిలో పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
ఒక పాన్‌లో నూనె వేసి గోంగూర, పచ్చిమిర్చిని మగ్గించాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా చేయాలి.
కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ వేగించాలి. ఆపై కారం, ధనియాల పొడి, ఉడికించిన బోటి ముక్కలు వేసి కలపాలి.
ఇప్పుడు ఉడుకుతున్న బోటి గ్రేవీలో మనం సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి, నూనె పైకి తేలేవరకు సన్నని మంటపై మగ్గించాలి.
వేడివేడి అన్నం లేదా జొన్న రొట్టెల్లోకి ఈ బోటి గోంగూర కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ రోజే మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి!