కూటమితోనే ఏపీకి భవిష్యత్తు: మంత్రి సవిత
ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి విధ్వంస పాలనతో ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశారని, చరిత్రలో వెన్నుపోటుదారుడిగా నిలిచిపోయారని మంత్రి సవిత (Savitha) విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అబివృద్ధి, సంక్షేమం జిల్లాస్థాయి విజయోత్సవ సభలో ఆమె ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ ప్రజల భవిష్యత్తుకు భరోసా అని చెప్పారు. సీఎం చంద్రబాబు (Chandrababu) రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. కూటమి రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, వైసీపీ (YCP) పాలనలో జరిగిన విధ్వంసంపై చర్చకు సిద్ధమా అని వైసీపీ అధినేత జగన్ (Jagan)కు సవాలు విసిరారు.








