రాష్ట్రంలో కూటమి.. దేశంలో బీజేపీ : పార్థసారథి
గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ర్టానికి వినాశం తప్పదు. రాబోయే కాలంలో మళ్లీ కూటమి పార్టీలు రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావాలని మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) పేర్కొన్నారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండేళ్ల కూటమి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీ అని ఎందుకంటున్నారో వివరించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఒక అడుగు ముందుకు వేయాలంటే అన్నీ ఆలోచిస్తారు. దానికి విరుద్ధంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత, తెనాలి (Tenali)లో గంజాయితో హల్చల్ చేసే ఇద్దరు యువకులను పోలీసులు దండిస్తే, వారి దగ్గరకు జగన్మోహన్రెడ్డి (Jagan Mohan Reddy) వెళ్లి, మన ప్రభుత్వం వస్తుందని. నేను చూసుకుంటానంటూ భుజం తట్టారంటే అది గొడ్డలి పార్టీ కాక ఏమంటారో ఆలోచించండి అని ధ్వజమెత్తారు.








