Minister Kolusu: వైసీపీ నాయకులు, కార్యకర్తలే దీన్ని వ్యతిరేకిస్తున్నారు : మంత్రి పార్థసారథి
మావిగన్ అంటూ వైసీపీ అధినేత జగన్ (Jagan) చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలే దీన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. శుభకార్యాల్లో అమంగళకరమైన పేర్లు పలకకూడదని ప్రజలు భావిస్తారు. ఏపీ ప్రజలకు జగన్ అనే పేరు కూడా అలాంటిదే. పార్లమెంటు (Parliament)లో అన్ని పార్టీలూ అమరావతి (Amaravati)కి మద్దతు తెలిపితే వైసీపీ సభ్యులు వాకౌట్ చేసింది. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. రాజధాని పూర్తిస్థాయిలో నిర్మాణమైతే రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది అని తెలిపారు.
ఇవి కూడా చదవండి








