అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (Niranjan) (17)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పరామర్శించారు. హనుమకొండ (Hanumakonda), హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడితో కొద్దిసేపు ముచ్చటించారు. నిరంజన్ కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. నిరంజన్‌కు చిన్నప్పటినుంచి పవన్ అంటే ప్రత్యేక అభిమానం. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అతడు తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను కలవాలన్న కోరికను కుటుంబసభ్యులతో వెలిబుచ్చాడు. ఈ విషయం పవన్ వరకు వెళ్లింది. ఆయన తన అభిమాని కోసం హనుమకొండకు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని కలిశారు. అతడికి చెప్పలేనంత సంతోషాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం వరంగల్ (Warangal) భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.








