“రణబాలి” సినిమా నుంచి హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ బర్త్ డే పోస్టర్ రిలీజ్
-“రణబాలి” చిత్రంలో సర్ థియోడోర్ హెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్న “ది మమ్మీ” మూవీ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. “రణబాలి”తో తొలిసారి ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు, “ది మమ్మీ” మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ.
ఈ చిత్రంలో ఆయన సర్ థియోడోర్ హెక్టర్ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆర్నాల్డ్ వోస్లూ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు “రణబాలి” మేకర్స్. బర్త్ డే పోస్టర్ లో ‘కరువు నేల రాక్షసుడు సర్ థియోడోర్ హెక్టర్’ అంటూ ఆయన పాత్రను పరిచయం చేశారు.ఇటీవలే “రణబాలి” సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.








