అవన్నీ తప్పుడు ప్రచారాలే!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా మెగా హీరోలకు సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఆగిపోయిందనే ప్రచారం కాగా, మరొకటి రామ్ చరణ్(Ram Charan) – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందనే వార్త. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రెండు ప్రచారాల్లోనూ ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ యథావిధిగా కొనసాగుతుండగా, ఆ సినిమా నిలిచిపోయిందనే వార్తలు పూర్తిగా ఆధారరహితమని తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ప్రస్తుతం పెద్ది(Peddi) విజయోత్సాహంలో ఉన్న ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెలతో చరణ్ సినిమా ఖరారైందని కొన్ని మీడియా వర్గాలు కథనాలు ప్రచురించాయి. అయితే ప్రస్తుతం చరణ్ లైనప్‌లో పెద్ది తర్వాత డైరెక్టర్ సుకుమార్(Sukumar)తో చేయనున్న #RC17 ప్రాజెక్ట్ మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, కథను మరింత మెరుగుపరిచే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారని ఇటీవల వచ్చిన రిపోర్టులు సూచిస్తున్నాయి.
అదే సమయంలో #RC18 గురించి ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని, ఏ డైరెక్టర్నీ అధికారికంగా ఫైనల్ చేయలేదని సమాచారం. దీంతో రామ్ చరణ్- శ్రీకాంత్ ఓదెల సినిమా ఫిక్స్ అయిపోయిందనే ప్రచారం కూడా ప్రస్తుతం వాస్తవానికి దూరంగానే కనిపిస్తోంది. టాలీవుడ్లో పెద్ద హీరోల ప్రాజెక్టులకు సంబంధించిన రూమర్స్ తరచూ వైరల్ అవుతున్న నేపథ్యంలో, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలను పూర్తిగా నమ్మకపోవడమే మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మెగా అభిమానుల దృష్టి మొత్తం #RC17 పై ఉండగా, #RC18 విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.








