16th June 2026

__________

- Saidulu

చూడగానే గుటుక్కుమనిపించే మెత్తని జ్యూసీ బెంగాలీ రసగుల్లా.. 

నోట్లో వేస్తే కరిగిపోయే రసగుల్లా అంటే ఇష్టపడని వారుంటారా? పండగైనా, ఫంక్షన్ అయినా ఈ స్వీట్ ఉంటే ఆ మజానే వేరు.

దీని కోసం 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు, 2 చెంచాల నిమ్మరసం, 1 కప్పు చక్కెర, మరికొన్ని నీళ్లు ఉంటే సరిపోతుంది.

కావలసిన పదార్థాలు

ముందుగా పాలను బాగా మరిగించాలి. స్టవ్ ఆపి, కొద్దికొద్దిగా నిమ్మరసం వేస్తూ పాలు పూర్తిగా విరిగేలా కలపాలి.

పాలు విరగ్గొట్టడం 

విరిగిన పాలను పల్చటి కాటన్ గుడ్డలో వడకట్టాలి. నిమ్మకాయ పులుపు పోవడానికి ఆ పనీర్‌ను చల్లటి నీటితో బాగా కడగాలి.

 వేరు చేయడం

గుడ్డను గట్టిగా పిండి నీరంతా తీసేయాలి. ఆపై తేమ పూర్తిగా పోవడానికి ఒక గంట పాటు ఎక్కడైనా వేలాడదీసి ఉంచాలి.

నీటిని పిండేయడం

ఇప్పుడు చెన్నాను ఒక ప్లేట్లోకి తీసుకుని, అరచేతితో కనీసం 8-10 నిమిషాల పాటు సాఫ్ట్ ముద్దలా బాగా మర్దనా చేయాలి.

 పిండిని మర్దనా చేయడం

తయారైన పిండి ముద్దను చిన్న చిన్న భాగాలుగా చేసి, ఎక్కడా పగుళ్లు (cracks) లేకుండా గుండ్రటి సాఫ్ట్ ఉండలుగా చుట్టుకోవాలి.

ఉండలు చుట్టడం 

ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్పు చక్కెరకి 4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాకం పల్చగానే (తీగ పాకం వద్దు) ఉండాలి.

చక్కెర పాకం

మరుగుతున్న పాకంలో రసగుల్లా ఉండలు వేసి, మూత పెట్టి హై ఫ్లేమ్‌పై 15 నిమిషాలు ఉడికిస్తే అవి రెట్టింపు సైజుకు వస్తాయి.

ఉడికించడం 

ఉడికిన రసగుల్లాలను 5 గంటలు పాకంలోనే నాననివ్వాలి. ఆపై ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే జ్యూసీ రసగుల్లా రెడీ!