16th June 2026

__________

- Saidulu

మనిషి సత్తువను పెంచే సత్తు లడ్డు చేసుకుందామా మరి... 

వేయించిన శనగలను మెత్తగా విసిరిన పిండినే 'సత్తు' అంటారు. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన దేశీ సూపర్ ఫుడ్.

సత్తు అంటే ఏంటి?

సత్తు పిండి, నెయ్యి, బెల్లం లేదా ఖర్జూరం, యాలకుల పొడి మరియు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఉంటే చాలు, లడ్డూలు రెడీ!

కావలసిన పదార్థాలు

నేటి ఆధునిక ట్రెండ్ ప్రకారం లడ్డూలు మరింత టేస్టీగా మారేందుకు సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలను నెయ్యిలో వేయించి కలపండి.

డ్రై ఫ్రూట్స్ ట్విస్ట్ 

ఒక బాణలిలో ఒక చెంచా నెయ్యి వేసి, సత్తు పిండిని కేవలం 2 నిమిషాలు తక్కువ మంటపై దోరగా వేడి చేయండి. దీనివల్ల మంచి సువాసన వస్తుంది.

పిండిని వేడి చేయడం

వేడైన పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని, అందులో బెల్లం పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి చేత్తో బాగా కలుపుకోవాలి.

 మిశ్రమం సిద్ధం చేయడం

మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో నొక్కుతూ గుండ్రని లడ్డూలుగా చుట్టండి. ఒకవేళ పొడిగా ఉంటే మరికొద్దిగా నెయ్యి కలపండి.

లడ్డూలు చుట్టడం

ఇలా ఇంట్లోనే ఈజీగా చేసిన సత్తు లడ్డూలను ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెడితే కనీసం 2 నుండి 3 వారాల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి.