16th June 2026

__________

- Saidulu

ఇక నిమ్మకాయలకు కొరతే లేదు... ఇంట్లోనే ఏడాదంతా పండ్లు ఇచ్చే బారామాసి నిమ్మ మొక్క!

వంటకాల్లో, వేసవి దాహార్తిని తీర్చడంలో నిమ్మకాయల పాత్ర ప్రత్యేకం. ఇకపై మార్కెట్‌తో పనిలేకుండా ఇంట్లోనే నిమ్మకాయలు పండించుకోండి!

బారామాసి అంటే 12 నెలలు అని అర్థం. సాధారణ నిమ్మ మొక్కల్లా కాకుండా, ఈ రకం మొక్క ఏడాది పొడవునా పూత, కాపుతో కళకళలాడుతుంది.

అసలు బారామాసి అంటే

ఈ మొక్కలు పెద్దగా పెరగవు. కాబట్టి మీ ఇంటి టెర్రస్ పైన లేదా బాల్కనీలో చిన్న కుండీలలో కూడా వీటిని సులభంగా పెంచవచ్చు.

కుండీలకు అనువైనది

ఇసుక కలిసిన గుల్లమట్టి ఈ మొక్కకు బెస్ట్. కుండీలో నాటేటప్పుడు మట్టితో పాటు సమానంగా పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్ట్ కలపాలి.

మట్టి మిశ్రమం

నిమ్మ మొక్కలు వేడిని ఇష్టపడతాయి. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా సూర్యకాంతి తగిలే ప్రదేశంలోనే వీటిని ఉంచాలి.

సూర్యకాంతి ముఖ్యం

మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకూడదు. పైన ఉన్న మట్టి పొడిబారినప్పుడు మాత్రమే తగినంత నీరు పోయాలి, ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోతాయి.

నీటి యాజమాన్యం

మొక్కకు పూత వచ్చినప్పుడు నీటి శాతాన్ని కొద్దిగా తగ్గించాలి. మూడు రోజులకు ఒకసారి పలచని మజ్జిగను పోస్తే పూత రాలకుండా ఉంటుంది.

పూత నిలవాలంటే

ప్రతి మూడు నెలలకోసారి గుప్పెడు సేంద్రియ ఎరువు వేయాలి. పొటాషియం, నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువులు ఇస్తే కాయలు బాగా కాస్తాయి.

సేంద్రియ ఎరువులు

ఆకుతొలుచు పురుగు, తెగుళ్లు రాకుండా ఉండటానికి పదిహేను రోజులకొకసారి వేపనూనె (Neem Oil) ను నీటిలో కలిపి మొక్కపై స్ప్రే చేయాలి.

తెగుళ్ల నివారణ

కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు.. బారామాసి నిమ్మ మొక్క మీ కుటుంబానికి ఏడాది పొడవునా తాజా నిమ్మకాయలను అందిస్తూనే ఉంటుంది.