వాస్తు ప్రకారం కుబేర మొక్కను ఇంటికి ఉత్తర దిశలో లేదా ఈశాన్య మూలలో ఉంచాలి. ఇది కెరీర్ గ్రోత్‌ను, కొత్త అవకాశాలను ఇస్తుంది.
ఒకవేళ వ్యాపారంలో లాభాలు కావాలనుకుంటే, హాల్ లేదా ఆఫీస్ రూమ్‌లోని ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) మూలలో ఈ మొక్కను ఉంచడం చాలా శుభప్రదం.
కుబేర మొక్కకు రోజూ కనీసం 4 నుండి 6 గంటల పరోక్ష సూర్యరశ్మి (Indirect Sunlight) అవసరం. కిటికీల దగ్గర ఉంచితే బాగా పెరుగుతుంది.
ఇది సక్యులెంట్ జాతి మొక్క. కాబట్టి కుండీలోని పై మట్టి పూర్తిగా ఎండిపోయినప్పుడే నీరు పోయాలి. ఎక్కువ నీరైతే వేర్లు కుళ్ళిపోతాయి.
కుబేర మొక్కకు కింద రంధ్రాలు ఉన్న కుండీనే వాడాలి. వాస్తు ప్రకారం ఎరుపు, బ్రౌన్ లేదా గోల్డ్ కలర్ కుండీలు వాడితే మరింత మంచిది.
కుబేర మొక్క ఉన్న ప్రదేశం ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉండాలి. డస్ట్బిన్లు, మురికి బట్టలు లేదా చీపుర్లు ఈ మొక్కకు దగ్గరగా ఉంచకూడదు.
మొక్క ఎప్పుడూ పచ్చగా, కళకళలాడుతూ ఉండాలి. ఎండిపోయిన లేదా రాలిన ఆకులను వెంటనే తొలగించాలి, లేదంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
కుబేర మొక్కను బెడ్రూమ్లో గానీ లేదా బాత్రూమ్లలో గానీ ఉంచకూడదు. దీనివల్ల మానసిక ప్రశాంతత తగ్గి, ధనం వృథాగా ఖర్చవుతుంది.