సియాటెల్‌లోATA 100 మైళ్ల ఛాలెంజ్ ఘన విజయం
ATA : అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ – సియాటెల్ (ATA-Seattle) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘100 మైళ్ల ఛాలెంజ్’ అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యుల అంకితభావం, పట్టుదల , అద్భుతమైన కమ్యూనిటీ స్ఫూర్తి అందరినీ ఆకట్టుకున్నాయి.
నినాదం..
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం , సభ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. ప్రతి మైలు, ప్రతి అడుగు కమ్యూనిటీని మరింత దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుందనే నినాదంతో సాగిన ఈ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ , పాల్గొన్న క్రీడాకారులందరికీ నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.








