జులై 11 నుంచి ఆటా ఆధ్వర్యంలో వృత్తి నిపుణులతో SAT కోచింగ్
ATA: అమెరికా తెలుగు సంఘం ( ATA) హైస్కూల్ విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు బాటలు వేస్తూ, ప్రత్యేక ‘SAT’ కోచింగ్ తరగతులను ప్రకటించింది. 10 సంవత్సరాలకు పైగా అపార అనుభవం ఉన్న నిపుణులైన ట్యూటర్ల ద్వారా ఈ శిక్షణ అందించనున్నారు.
కోచింగ్ వివరాలు..
ఈ కోచింగ్ కార్యక్రమం జులై 11, 2026న ప్రారంభమై, అక్టోబర్ 4, 2026 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బిగినర్స్ (మధ్యాహ్నం 3:30 – 5:00) , అడ్వాన్స్డ్ (సాయంత్రం 5:00 – 6:30) విభాగాల్లో తరగతులు జరుగుతాయి. ఆటా సభ్యులు $200 ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ లింక్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
19వ ఆటా మహాసభలు..
అంతేకాకుండా, ఈ శిక్షణతో పాటు రాబోయే ’19వ ఆటా మహాసభలు , యూత్ కన్వెన్షన్’ (జులై 11 – ఆగస్టు 2, 2026) బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరగనుంది. మరిన్ని వివరాల కోసం ఆటా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.








