పలు ప్రాజెక్టులకు ఎస్ఐబీపీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పెట్టుబడులు` మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐబీపీ (SIBP) ఆమోదం తెలిపింది. దాదాపు 50కి పైగా ప్రాజెక్టులకు సంబంధించి ఎసఐపీబీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh), టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్ (Sai Prasad) వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








