పూజ గదిలో లేదా హాల్‌లో దూపం వేసినప్పుడు గోడలపై నల్లటి మసి పేరుకుపోతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో మీ గోడలను మళ్లీ కొత్తవాటిలా మార్చేయండి!
మసి మరకలపై నేరుగా నీళ్లు పోయకూడదు. ముందుగా ఒక పొడి మైక్రోఫైబర్ క్లాత్ లేదా వ్యాక్యూమ్ క్లీనర్‌తో పైపైన ఉన్న పొడి మసిని తుడిచేయాలి.
గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల జెల్ లేదా డిష్ వాష్ లిక్విడ్ కలపండి. ఈ మిశ్రమం గోడలపై ఉండే జిడ్డును, మసిని సులభంగా వదిలిస్తుంది.
తయారుచేసిన లిక్విడ్‌లో సాఫ్ట్ స్పాంజ్ ముంచి, గట్టిగా పిండి, మరకలపై గుండ్రంగా (Circular motion) మృదువుగా రుద్దాలి. గట్టిగా రుద్దితే పెయింట్ పోతుంది.
మరకలు మొండిగా ఉంటే, కొద్దిగా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని మసి మరకలపై రాసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
సమభాగాల నీరు, వైట్ వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్‌లో పోయండి. దీన్ని మసిపై స్ప్రే చేసి, ఒక నిమిషం ఆగి కాటన్ క్లాత్‌తో తుడిస్తే జిడ్డు వదులుతుంది.
మార్కెట్లో దొరికే 'మెలమైన్ ఫోమ్' లేదా మ్యాజిక్ ఎరేజర్ స్పాంజ్లను కొద్దిగా తడిపి తుడిస్తే ఎలాంటి కెమికల్స్ లేకుండా మసి మాయమవుతుంది.
పొడి మసి మరకలను తొలగించడానికి ప్రత్యేకమైన 'సూట్ ఎరేజర్' (Soot Eraser) లేదా డ్రై క్లీనింగ్ స్పాంజ్లు దొరుకుతాయి. ఇవి నీరు లేకుండానే క్లీన్ చేస్తాయి.
ఏ పద్ధతిలో క్లీన్ చేసినా, చివరగా ఒక పొడి, శుభ్రమైన తెల్లటి కాటన్ గుడ్డతో గోడను తుడవాలి. తేమ ఉంటే గోడలపై బూజు పట్టే ప్రమాదం ఉంది.