చికాగోలో నాట్స్ అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తమ సేవా నిరతిని చాటుకుంది. చికాగో చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “అడాప్ట్-ఎ-హైవే” స్వచ్ఛంద సేవా కార్యక్రమం సమాజంలో ఒక సరికొత్త సేవా స్ఫూర్తిని రగిలించింది. స్థానిక తెలుగు వారు ఉత్సాహంగా ముందుకొచ్చిన చేసిన ఈ సేవా కార్యక్రమం చికాగోలో తెలుగువారికి సామాజిక బాధ్యత ఎంత ఉందనేది నిరూపించింది.
హైవే కొంత భాగాన్ని దత్తత తీసుకుని దాని పరిశుభ్రత, పచ్చదనం కాపాడే బాధ్యతను నాట్స్ దిగ్విజయంగా నిర్వహించింది. దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ సేవా పథంలో అడుగులు వేయడం విశేషం. రేపటి పౌరులైన యువ వాలంటీర్లలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత పట్ల ఒక దృఢమైన బాధ్యతాభావాన్ని ఈ కార్యక్రమం పెంపొందించింది.. సమాజాన్ని పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో నాట్స్ ద్వారా విద్యార్ధులు చేస్తున్న ఈ సేవలువ వారి భవిష్యత్ విద్యా, వృత్తిపరమైన ప్రయాణాలకు ఎంతగానో దోహదపడే విలువైన వాలంటీర్ సేవా గంటలుగా అధికారికంగా గుర్తించబడతాయి.
తెలుగు విద్యార్దులు హైవే దత్తత కార్యక్రమంలో చూపిన అంకితభావాన్ని, నిబద్ధతను నాట్స్ అధ్యక్షులు రాజ్ అల్లాడ హృదయపూర్వకంగా అభినందించారు. సామాజిక బాధ్యతను రేపటి తరంలో పెంపొందిచడానికి వారికి సేవా భావాన్ని పెంచడానికి నాట్స్ చికాగో బృందం చేసిన కృషిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల కొనియాడారు. ఈ సేవా కార్యక్రమం ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాలలు కీలక పాత్ర పోషించారు.
చికాగో చాప్టర్ సభ్యులు పండు చెంగళశెట్టి, మనోహర్ పాములపాటి, గోపీ, వరుణ్ గడ్డం, నాగరాజ్ మేడా, నామదేవ్ గాంధీ, చైతన్య, గణేష్ మాగుంటలకు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వీరితో పాటు, నెక్ట్స్ జెన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకే తోడ్పాటు అందిస్తున్న నాట్స్ మాజీ అధ్యక్షులు మదన్ పాములపాటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ బొప్పన, మూర్తి కొప్పాక, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వీర తక్కెళ్లపాటి, మాజీ బోర్డ్ సభ్యుడు శ్రీనివాస్ పిడికిటి, మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కే. బాలినేని, హరీష్ జమ్ముల తదితరులకు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. వాలంటీర్లందరికీ మధ్యాహ్న భోజనాన్ని స్పాన్సర్ చేసి మైగో కన్సల్టింగ్ సంస్థ కూడా తన సామాజిక బాధ్యతను చాటుకుంది.









