ఆలియా భట్, శర్వారి నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’ ట్రైలర్ విడుదల
ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా.. శర్వారి కీలక పాత్రలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. జూలై 3న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం మేకర్స్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇద్దరు అందమైన హీరోయిన్స్ డెడ్లీ రోల్స్‌లో కనిపించనున్నారు. సరదాగా, థ్రిల్లింగ్‌గా రూపొందిన ఈ భారీ పాప్ కార్న్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్‌ను గమనిస్తే.. ఆలియా భట్‌ను శక్తివంతురాలిగా తయారు చేసే మెంటర్‌గా బాబీ డియోల్ క్రూరమైన పాత్రలో కనిపించారు. హంతకురాలి పాత్రలో ఆలియా భట్ నటించింది. అయితే ఆమె కొన్ని పరిస్థితుల్లో తనకు శిక్షణ ఇచ్చిన మెంటర్కే శత్రువుగా మారి వ్యతిరేకంగా పోరాడుతుంది. బాబీ డియోల్, ఆలియా భట్‌లకు ఆల్ఫా ప్రోగ్రామ్‌తో ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇందులో అనీల్ కపూర్ మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. హై యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు సూపర్ ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆల్ఫా మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్గా అలరించనుందని తెలుస్తోంది. అలాగే ఆలియాతో పాటు శర్వారి కూడా ధైర్యంతో పోరాడే తత్వమున్న వ్యక్తులుగా ట్రైలర్ ఆవిష్కరించింది.
శర్వారి పాత్రను ట్రైలర్లో పెద్దగా ఆవిష్కరించలేదు. కానీ బాబీ డియోల్‌ను ఎదుర్కోవటానికి ఆలియా భట్‌కు అండగా నిలిచే పాత్రలో శర్వారి నటించినట్లు ట్రైలర్లో తెలుస్తోంది.
ఆల్ఫా ట్రైలర్‌లోని స్టైలిష్, కూల్ విజువల్స్ సినిమాలోని కంటెంట్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. గ్లోబల్ టాప్ డీజే హ్యూగెల్ వరల్డ్‌వైడ్ చార్ట్‌బస్టర్ ట్రాక్ జమైకన్ బామ్ బామ్‌ను ట్రైలర్లో ఉపయోగించారు. ఈ ట్రాక్ వల్ల థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఓ విభిన్నమైన అనుభూతిని పొందుతారనిపిస్తోంది.








