జులై 26న ఆటా ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నమెంట్
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో 2026, జులై 26న ఆదివారం ప్రత్యేక గోల్ఫ్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీ వర్జీనియాలోని గెయిన్స్విల్లేలో ఉన్న స్టోన్వాల్ గోల్ఫ్ క్లబ్లో జరగనుంది. ‘ఫోర్-మ్యాన్ స్క్రంబుల్’ ఫార్మాట్లో జరగనున్న ఈ గోల్ఫ్ టోర్నమెంట్, ఉదయం 9 గంటలకు ‘షాట్‌గన్ స్టార్ట్’తో ప్రారంభమవుతుంది.
వివరాలు..
ఈ పోటీలో పాల్గొనేందుకు ఒక టీమ్‌కు 500 డాలర్లు లేదా వ్యక్తిగతంగా ఒక్కో ప్లేయర్‌కు 125 డాలర్లు ప్రవేశ రుసుముగా ఆటా నిర్వాహకులు నిర్ణయించారు. ఈ రుసుములో రేంజ్ బాల్స్, అల్పాహారం, ఇండియన్ బఫెట్ లంచ్, విజేతలకు అవార్డులు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2 గంటలకు అవార్డుల ప్రదానం, భోజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు సంస్థ వెబ్సైట్ ద్వారా లేదా పోస్టర్లో పేర్కొన్న నిర్వాహకులను సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.








