కేంద్ర ప్రభుత్వ పథకాల్లో చేరేందుకు ప్రత్యేక స్టాళ్లు : మాధవ్
పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రవేశపెట్టారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ (Madhav) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ (Postal Department) ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ (Stall)ను ప్రారంభించారు. చౌకగా, అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. కేవలం రూ.750 చెల్లిస్తే రూ.15 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ ద్వారా అత్యధిక వడ్డీ ఇచ్చే పలు పథకాలను మోదీ ప్రవేశ పెట్టి సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరుందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం అందర భాగస్వాములు కావాలని కోరారు.








