అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సిందే : సీఎం చంద్రబాబు
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల విశ్లేషణ ఉంటుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులను ఆర్జీదారులే ఏస్థాయిలో ఉన్నాయో ట్రాక్ చేసుకునే కొత్త వ్యవస్థను అమలు చేయాలని అధికారులను నిర్దేశించారు. ఉన్నతాధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది దాకా క్షేత్రస్థాయిలో వారంలో మూడ్రోజులు పర్యటనలు చేయాలని, ఈ నెల నుంచే మొదలుపెట్టాలని తాను గతంలోనే ఆదేశించానని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్లు (District Collectors) ప్రతి నియోజకవర్గం (Constituency)లో నెలలో నాలుగు సార్లు పర్యటించాలన్నారు. ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యమÖ ఉండకూడదు అని సీఎం పేర్కొన్నారు.








