నాపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం : అమర్నాథ్
ఇటీవల తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) పేర్కొన్నారు. విశాలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజులుగా నాపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వైఎస్ విజయమ్మ (YS Vijayamma), భారతి (Bharathi)ల గురించి హోంమంత్రి అనిత (Home Minister Anita) మాట్లాడిన సంస్కారహీనమైన భాషను మాత్రమే ఖండించా. మÖడు తరాల రాజకీయ కుటుంబనేపథ్యం ఉన్న నేను ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు. మాజీ మంత్రినన్న గౌరవం లేకుండా నన్ను వాడెవడు అని హోంమంత్రి ప్రశ్నించడం ఆమె అహంకారానికి నిదర్శనం. నా వ్యాఖ్యలపై పోలీసులు కేసులు పెట్టినా భయపడను అని వెల్లడించారు.








