Amarnath: మాజీ మంత్రి అమర్నాథ్కు ఆరు నెలల జైలు శిక్ష
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath)కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ, విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి (Varalakshmi) తీర్పు ఇచ్చారు. విశాఖ (Visakha)కు ప్రత్యేక రైల్వేజోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్లో అమర్నాథ్ ఆందోళనలు నిర్వహించారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఘటనపై అప్పట్లో టూటౌన్ పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. విచారణ పూర్తవడంతో, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి మాజీ మంత్రికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దిగువ న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్తానని అమర్నాథ్ పేర్కొన్నారు. అప్పట్లో రైల్వేజోన్ కోసం పోరాటం చేయడం వల్లే ఇప్పుడు విశాఖ జోన్ వచ్చిందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







