ఆటా ఆధ్వర్యంలో జులై 31న యువత కోసం ప్రత్యేక ‘యూత్ క్రూయిజ్
Youth Cruise: ఆటా 19వ మహాసభలు , యూత్ కన్వెన్షన్ సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా – ATA) ఒక ప్రత్యేకమైన ‘యూత్ క్రూయిజ్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం 2026, జులై 31న బాల్టిమోర్ హార్బర్లో జరగనుంది. 16 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువత కోసం రూపొందించిన ఈ క్రూయిజ్, వారంతా ఒకే చోట చేరి, కొత్త స్నేహాలు చేసుకుంటూ సరదాగా గడపడానికి చక్కని వేదిక కానుంది.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ క్రూయిజ్ ప్రయాణంలో భాగంగా డిజే (DJ) సంగీతం, డ్యాన్స్ ఫ్లోర్, , ఆహారం, పానీయాల సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు 60 డాలర్ల టికెట్ ధరను చెల్లించి, నిర్ణీత వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న యువత, మరిన్ని వివరాల కోసం యూత్ కమిటీని లేదా సంస్థ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.








