18వ ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
పేద-మధ్య తరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు
ఇథనాల్… సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రొత్సాహం
మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు చర్యలు
పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం
18వ ఎస్ఐపీబీ సమావేశంలో రూ.30515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
అమరావతి, జూన్ 18: పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకో సిస్టంను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 18వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి.
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పేద, మధ్య తరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాదు… సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రొత్సాహం అందించాలి. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీఐహెచ్ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలి. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలి. ఈ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. దీనికి అనుగుణంగా ఎకో సిస్టం ఏర్పాటు చేసే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టాలి. ఇక వచ్చే పరిశ్రమలకు అనుగుణంగా కరిక్యులమ్ తయారు చేసే దిశగా విద్యా శాఖ ఆలోచన చేయాలి. పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించి దానికి అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలి. రోబోటిక్స్ లాంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా మన విద్యా సంస్థల్లో ఉండాలి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నాన్ సీరియస్ ప్లేయర్స్ కు ఏపీలో చోటు లేదు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక… వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలి. పనులు ప్రారంభించని సంస్థలతో టచ్ లో ఉంటూ ఫాలో అప్ చేయాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు.
ఆటోమేషన్ లో పారిశ్రామిక అనుమతులు
“ఇథనాల్ తయారీ విషయంలో ముందడుగు వేయాలి. 40 శాతం ఇథనాల్ బ్లెండ్ చేసేందుకు కేంద్రం అంగీకరిచింది. ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రొత్సాహిస్తే… రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుంది. బయో ఫ్యూయల్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉంది. ఈ విషయంపై ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరపాలి. అలాగే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు.. విద్యుత్ సరఫరా అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ఈ ఏడాది డిమాండ్ లో 17 శాతం వృద్ధి నమోదైంది. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య విభాగాల వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఎంత అవసరం అవుతుందో అంచనాలు తయారు చేయాలి. సోలార్ విండ్, పంప్డ్ స్టోరేజితో పాటు BESS టెక్నాలజీకే ఇక భవిష్యత్తు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీకి అనుగుణంగా పంప్డ్ స్టోరేజి సహా ఇతర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేప్టటాలి. లీథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈవీలకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలపై దృష్టి పెట్టాలి. బ్యాటరీ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టండి. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ వినియోగం అనేది అత్యంత కీలకం. డేటా సెంటర్ల అనుమతుల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
సెమీ కండక్టర్లపై ఎక్కువ దృష్టి సారించాలి. దానికి సంబంధించిన ఎకోసిస్టంపై ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఇక మైక్రో ఇరిగేషన్ రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి. మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ కంపెనీలను ఎంకరేజ్ చేద్దాం. భవిష్యత్తులో హార్టికల్చర్, ఫ్లోరీకల్చర్ కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. దీంతో మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ క్రమంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల పరిశ్రమలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల రైతులకూ తక్కువ ధరలో మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వస్తుంది. అమరావతిలో ఏఐ, ఆల్గారిథమ్స్ క్వాంటం అప్లికేషన్ల రూపకల్పన మొదలైంది. ప్రాజెక్టుల అనుమతులు, భూ కేటాయింపులు వంటివి సులభతరంగా అందించాలి. దీంతో పాటు రాజకీయ జోక్యం అనేది లేకుండా చూడాలి. అన్ని నిబంధనలు పాటించిన ప్రాజెక్టులకు ఆటోమోషన్ పద్దతిలో అనుమతులు లభించే విధానాన్ని అనుసరిస్తే.. రాజకీయ జోక్యం తగ్గిపోతుంది. ఆ దిశగా అధికారులు ఆలోచనలు చేయాలి.
అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి ఓ ఎకోసిస్టమ్ రావాలి. టవర్లతో పాటు టెక్నాలజీ పార్క్ రావాలి. క్వాంటం అప్లికేషన్లతో పాటు క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా రావాలి. మరోవైపు ఆటోమొబైల్ పరిశ్రమలకు శ్రీసిటీ సహా అనంతపురం జిల్లా కూడా కీలకం. తిరుపతి, శ్రీసిటీలు రాయల్ ఎన్ ఫీల్డ్, ఇసుజు, హీరో లాంటి ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అనంతపురంలో కియా కార్ల ఉత్పత్తి జరుగుతోంది. పుట్టపర్తిలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం వేగంగా గ్రౌండ్ కావాలి. ఫైటర్ జెట్ తయారీ కేంద్రం పనుల విషయంలో నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉండాలి. కేంద్రానికీ ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కారం చూపాలి. బెంగుళూరు-పుట్టపర్తి డిఫెన్సు కారిడార్ గా మారుతుంది. ఏరోస్పేస్ కారిడార్ గా ఈ ప్రాంతాన్ని మార్చాలి. తాడిపత్రి- అనంతపూర్ మధ్య ఓ ఎయిర్ స్ట్రిప్ వచ్చేలా చూడాలి.”అని సీఎం చంద్రబాబు సూచించారు.
జొన్నగిరి… స్వర్ణగిరి
“పర్యాటకులు ఎక్కువ సమయం రాష్ట్రంలో గడిపేలా హోటళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. మహీంద్రా క్లబ్ సంస్థ బీచ్ రిసార్ట్స్, పులికాట్ లేక్ వద్ద కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. అరకు లాంటి ప్రాంతాల్లోనూ ఐటీడీఏ భాగస్వామ్యంతో మహీంద్రా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. టెంపుల్ టూరిజంను ప్రోత్సహించేలా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను గుర్తించి వాటి వద్ద పెట్టుబడులు వచ్చేలా చూడాలి. తిరుపతి, అమరావతి, విశాఖలలో బాబా రామ్ దేవ్ యోగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. గండికోట, పోలవరం ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు వద్ద పెద్ద ఎత్తున హోటళ్లు రావాల్సి ఉంది. హార్సిలీ హిల్స్ వద్ద మంచి రిసార్టులు ఏర్పాటు చేస్తే టూరిస్టులు మరింతగా పెరుగుతారు. సూర్యలంక బీచ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి… బెస్ట్ బీచ్ టూరిజం స్పాట్ గా సూర్యలంకను తీర్చిదిద్దాలి. పర్యాటక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలి.
అమరావతిలో వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ కూలింగ్, పైప్డ్ గ్యాస్, విద్యుత్ లాంటివి పూల్ గా ఇచ్చే పరిస్థితి వస్తే ప్రాజెక్టుల వ్యయం తగ్గుతుంది. రేర్ ఎర్త్ మినరల్స్ కు ఏపీ కేంద్రంగా మారాలి. రేర్ ఎర్త్ మినరల్స్ కు సంబంధించిన ఎండ్ టూ ఎండ్ సొల్యూషన్స్ ఏపీలో అందుబాటులో ఉండేలా ఎకోసిస్టమ్ రావాలి. రేర్ ఎర్త్ మినరల్స్ పై ఓ ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయాలి. జొన్నగిరి గోల్డ్ మైన్ 1000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. జొన్నగిరి అత్యంత పురాతన చరిత్ర ఉంది. ఒకప్పుడు జొన్నగిరికి స్వర్ణగిరి అని పేరుంది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవ్వాలి. విశాఖ నగరంలో ప్రస్తుత సదుపాయాలను మరింత మెరుగు పరుస్తూనే.. శాటిలైట్ టౌన్ షిప్ లు అభివృద్ధి జరిగేలా చూడాలి. పరిశ్రమలతో పాటు.. హౌసింగ్ కూడా ఉండాలి. పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు జరిగేలా చూడాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు: మంత్రి లోకేష్
ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులను అమలు చేయాలని ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ సూచించారు. భూ కేటాయింపులు జరిగిన తర్వాత వేగంగా ప్రాజెక్టులు ప్రారంభం కావాలి… అప్పుడే జీఎస్టీ సహా వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని… అప్పుడు ప్రొత్సాహాకాలు ఇవ్వవచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇక ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను స్థానిక పరిశ్రమలతో మ్యాపింగ్ చేసి దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుతున్నామని లోకేష్ వివరించారు. ఆంధ్రా యూనివర్సిటీలో రేర్ ఎర్త్ మినరల్స్ పరిశోధనపై సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇటీవల చేపట్టిన రష్యా పర్యటనలో తాను గమనించిన అంశాలను లోకేష్ ప్రస్తావించారు. రష్యాలో క్వాంటం అప్లికేషన్లకు సంబంధించి ఓ ప్రత్యేకమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు అయి ఉందని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, టీజీ భరత్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
18వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన కంపెనీలు, పెట్టుబడుల వివరాలు:
1.ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, రూ. 6000 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉద్యోగ అవకాశాలు- అనంతపురం
2.ఆరాధ్య బయోప్యూయెల్ ప్రై.లిమిటెడ్ రూ. 75.78 కోట్ల పెట్టుబడి, 402 మందికి ఉద్యోగాలు, కృష్ణా జిల్లా
3.సమయ్ బయో సీఎన్జీ చిత్తూర్ ప్రై.లిమిటెడ్ రూ.120 కోట్లు పెట్టుబడి, 260 ఉద్యోగాలు, చిత్తూరు
4.శ్రీవాయు బయోఫ్యూయెల్స్, రూ.67.22 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు, కాకినాడ
5.ఆంధ్రా బయో ఎనర్జీ, రూ.96.40 కోట్ల పెట్టుబడి, 518 మందికి ఉద్యోగాలు, అనకాపల్లి
6.విక్సిత్ అగ్రి గ్రీన్ ఎనర్జీ, రూ.141.65 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు, ఎన్టీఆర్ జిల్లా
7.కంట్రోల్ ఎస్ డేటా సెంటర్, రూ.2788.30 కోట్ల పెట్టుబడి, 160 మందికి ఉద్యోగాలు, అనకాపల్లి
8.జెట్ ఫ్యాబ్ ఇండియా, రూ.740 కోట్ల పెట్టుబడి, 1049 మందికి ఉద్యోగాలు, తిరుపతి జిల్లా
9.ఇన్ ఫినిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్, రూ.170 కోట్ల పెట్టుబడి, 4000 మందికి ఉద్యోగాలు, విశాఖ
10.ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, రూ.50 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు, విశాఖపట్నం
11.ఇ-ప్యాక్ డ్యూరబుల్, ఇ-ప్యాక్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీస్, రూ.1084.31 కోట్ల పెట్టుబడి, 1600 మందికి ఉద్యోగాలు, నాయుడుపేట, శ్రీసిటి, తిరుపతి జిల్లా
12.ఆంబర్ ఎంటర్ ప్రైజెస్, రూ.445 కోట్ల పెట్టుబడి, 1250 మందికి ఉద్యోగాలు, శ్రీసిటి తిరుపతి జిల్లా
13.ఎంసీఎన్ఈఎక్స్ ఇండియా, రూ.347 కోట్లు, 1633 మందికి ఉద్యోగాలు, శ్రీసిటీ తిరుపతి జిల్లా
14.వరుణ్ హాస్పిటాలిటీ ప్రై.లిమిటెడ్, రూ.280.33 కోట్ల పెట్టుబడి, 600 మందికి ఉద్యోగాలు, అమరావతి
15.ఇంద్రోయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్, రూ.539 కోట్ల పెట్టుబడి, 600 మందికి ఉద్యోగాలు, అమరావతి
16.విజయనగర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫ్రా, రూ.53.35 కోట్ల పెట్టుబడి, 225 మందికి ఉద్యోగాలు, ఆనందపురం, విశాఖ
17.దైవిక్ హోటల్స్ ప్రైలిమిటెడ్ రూ.186.84 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు, అమరావతి
18.శుభసంకల్ప్, రూ.174.52 కోట్లు, 300 మందికి ఉద్యోగాలు
19.వెసెల్లా 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్ రూ.210.14 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు, కర్నూలు
20.దుర్గా కండేవ్-పద్మా హాస్పిటాలిటీ కన్సార్టియం, రూ.163.36 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, విశాఖపట్నం
21.వైట్ ఓక్ రిసార్ట్స్ , రూ.79.01 కోట్లు పెట్టుబడి, 250 మందికి ఉద్యోగాలు, విశాఖపట్నం
22.ఎస్ఏఏఫ్ ఒన్ ఇండియా-ఎస్పీ కాంపాక్ట్ లిమిటెడ్ రూ.1900 కోట్ల పెట్టుబడి, 2500 మందికి ఉద్యోగాలు, కాకినాడ
23.ప్రోటీరియల్ ఇండియా, రూ.2,250 కోట్లు, 530 మందికి ఉద్యోగాలు, అనకాపల్లి
24.నాన్ మాగ్నెటెక్ ప్రై.లిమిటెడ్, రూ.1250 కోట్లు, 400 మందికి ఉద్యోగాలు, తిరుపతి
25.ఏపీ జెఎస్ డబ్ల్యూ స్టీల్స్ , రూ. 1230.20 కోట్లు, 155 మందికి ఉద్యోగాలు, ప్రకాశం జిల్లా
26.వయోనా ఎనర్జీ, రూ.468 కోట్లు పెట్టుబడి, 1300 మందికి ఉద్యోగాలు, నెల్లూరు జిల్లా
27.బెర్జర్ పెయింట్స్ , రూ.176.82 కోట్ల పెట్టుబడి, 40 మందికి ఉద్యోగాలు, సత్యసాయి జిల్లా
28.డివైస్ ఫార్మా టెక్ రూ.213.9 కోట్ల పెట్టుబడి, 114 మందికి ఉద్యోగాలు, తిరుపతి జిల్లా
29.ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రూ.63.94 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు, ఏలూరు
30.రెనాటస్ ప్రోడక్ట్స్ , రూ.350 కోట్లు, 370 మందికి ఉద్యోగాలు, తిరుపతి జిల్లా
31.ప్రీమియర్ ఎనర్జీస్ ఇంగాట్ వేఫర్, రూ.3936.20 కోట్ల పెట్టుబడులు, 540 మందికి ఉద్యోగాలు, తిరుపతి
32.జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ- రూ.525 కోట్లు పెట్టుబడి, 625 మందికి ఉద్యోగాలు, కర్నూలు
33.అనంత్ టెక్నాలజీస్ రూ.1000 కోట్ల పెట్టుబడి 750 మందికి ఉద్యోగాలు, నెల్లూరు జిల్లా
34.స్పేస్ ఫీల్డ్స్ ప్రై.లిమిటెడ్, రూ.46.83 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు, అనంతపురం
35.ఐకామ్ టెలీ, రూ.895 కోట్లు పెట్టుబడి, 1320 మందికి ఉద్యోగాలు, జగ్గయ్యపేట
36.అవెరాన్ పానల్స్, రూ.1123 కోట్ల పెట్టుబడి, 1200 మందికి ఉద్యోగాలు, గుడిపల్లె, శాంతిపురం చిత్తూరు
37.సర్లా ఏవియేషన్, రూ.330 కోట్ల పెట్టుబడి, 40 మందికి ఉద్యోగాలు, తిమ్మ సముద్రం, అనంతపురం
38.న్యూట్రీ ఫీడ్స్ అండ్ ఫార్మ్స్, రూ.216 కోట్ల పెట్టుబడి, 480 మందికి ఉద్యోగాలు, చిత్తూరు
39.పతంజలి ఆయుర్వేద్, రూ.370.10 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ఉద్యోగాలు, విజయనగరం
అమరావతి క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు
40.క్యూపిఐ ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రూ.47.16 కోట్లు, 9 మందికి ఉద్యోగాలు, అమరావతి
41.ఇంజిన్యువటీ నెక్సస్ టెక్నాలజీస్, రూ. 0.5 కోట్లు, 21 మందికి ఉద్యోగాలు, అమరావతి
42.సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్-సి.డాట్ రూ.10 కోట్లు, 5 మందికి ఉద్యోగాలు
43.క్యూబిట్ ఫోర్స్, రూ.100 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటం వ్యాలీ
44.ఆటోమోనిక్స్, రూ.79.8 కోట్లు, 190 మందికి ఉద్యోగాలు, అమరావతి క్వాంటం వ్యాలీ
45.క్రిప్ట్ షీల్డ్ , రూ10 కోట్లు, 20 మందికి ఉద్యోగాలు, అమరావతి
46.క్వాంటం బయో సైన్సెస్, రూ.22.5 కోట్లు, 10 మందికి ఉద్యోగాలు, అమరావతి
47.ఫ్రూగల్ ఏఐ, రూ.2.6 కోట్లు, 6 మందికి ఉద్యోగాలు,అమరావతి
48.క్యూరియమ్ రూ.0.45 కోట్లు, 5 మందికి ఉద్యోగాలు, అమరావతి
49.క్యూక్రిషి, రూ.25 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి
50.ఎస్ఏఎస్ క్యూట్ ఎలక్ట్రానిక్స్ రూ.60 కోట్లు, 100 మందికి ఉద్యోగాలు, అమరావతి
మొత్తం రూ. 30515 కోట్ల పెట్టుబడి, 29677 మందికి ఉద్యోగ అవకాశాలు








