దినేష్ కుమార్ హీరో గా “వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల
దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వం లో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా” ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ…
నేను కోమలి ఫోక్ సింగర్ గా నా కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టం తో నేను సినిమా తీయాలి అని ఒక ద్యేయం తో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రాన్ని పూర్తి చేసాము. ఈ సినిమా మొదలయినప్పటి నుండి ఇప్పటివరకు నేను పడిన కష్టం పడిన మాటలు కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు అన్ని కష్టాలు ఎదుర్కుని జులై లో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాము.
మా సినిమాకి మీడియా సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను అని కోమలి తెలిపారు.
దర్శకుడు సతీష్ అవాల మాట్లాడుతూ..
మా “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రన్ని జులై లో విడుదల కానుండి త్వరలోనే డేట్ ఫైనల్ చేసి ఆపిషియల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాము. మా కథ విషయానికోస్తే అందమైన ఒక పల్లెటూరు లో వెంకట్రమయ్య అనే పరువుగల కుటుంబం లోజరిగే ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బు తో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు గా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లి తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా. “వెంకట్రామయ్య గారి తాలూకా” మంచి ఫ్యామిలీ డ్రామాని కుటుంబం తో కలిసి థియేటర్ కి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని తెరకేకించాం అని దర్శకుడు సతీష్ ఆవాల తెలిపారు.








