విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
విశాఖలోని నోవాటెలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (Tribal University) ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) హాజరయ్యారు. మొత్తం 373 మంది డిగ్రీ, ఫీజ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ గిరిజన వర్సిటీ, విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer), మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh), అనిత (Anita) తదితరులు పాల్గొన్నారు.








