తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (Sanjay Jaju) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కె.రామకృష్ణారావు (K. Ramakrishna Rao) పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సీఎస్ (CS)కు, మాజీ సీఎస్ పుష్చగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు (Best wishes) తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది, తదితరులు సంజయ్ జాజును పుష్పగుచ్చాలతో అభినందించారు.








