ఫ్రిజ్‌లో ఇడ్లీ లేదా దోశ పిండి మిగిలిపోయిందా? రోజూ ఒకే టిఫిన్ తిని బోర్ కొడితే, ఈ కరకరలాడే సులభమైన పొంగనాలు ట్రై చేయండి!
మిగిలిన పిండి 2 కప్పులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, క్రిస్పీనెస్ కోసం కొద్దిగా ఉప్మా రవ్వ తీసుకోండి.
ఒక వెడల్పు గిన్నెలో దోశ లేదా ఇడ్లీ పిండిని తీసుకోండి. దానికి ఉప్మా రవ్వ (లేదా బియ్యప్పిండి), జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి .
ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొరివేపాకు, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా కలపండి.
చివరగా చిటికెడు వంట సోడా వేసి కలిపి, ఐదు నిమిషాలు పక్కన పెట్టండి. పిండి మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగా ఉండేలా చూసుకోండి.
స్టవ్ పై గుంత పొంగనాల పెనాన్ని ఉంచి వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత ప్రతి గుంతలోనూ కొన్ని చుక్కల నూనెను వేయాలి.
మంటను మధ్యస్థంగా ఉంచి, సిద్ధం చేసుకున్న పిండిని స్పూన్ సహాయంతో ప్రతి గుంతలో ముప్పావు వంతు వరకు నింపాలి.
పిండి వేసాక పెనంపై మూత పెట్టి, మధ్యస్థ మంట మీద మూడు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది.
పొంగనాలు క్రింది వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక, స్పూన్ తో రెండో వైపుకు తిప్పి, మరికొద్దిగా నూనె వేసి రెండు నిమిషాలు కాల్చాలి.
అంతే! కరకరలాడే గుంత పొంగనాలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీతో తింటే అద్భుతమైన రుచిగా ఉంటాయి!