లేయర్డ్ ఫ్లోరల్ ఫ్రాక్ లో నిహారిక గ్లామర్ షో
మెగా డాటర్ నిహారిక(Niharika) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటుందనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే నిహారిక తాజాగా వావ్ అనిపించే ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నిహారిక స్కై బ్లూ కలర్ సీక్విన్ ఫ్లోరల్ ఫ్రాక్ లో దేవకన్యలాగా మెరిసింది. ఈ అవుట్‌ఫిట్ నిహారికకు చాలా పర్ఫెక్ట్ గా సూటైందని ఆమె ఫాలోవర్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే నిహారిక నటిగా అప్పుడప్పుడు మెరుస్తూనే, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.








