లెనిన్ ప్రమోషన్స్‌కు ఎన్టీఆర్ ఎంట్రీ?
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా తెరకెక్కిన లెనిన్(Lenin) రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌పై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) భాగస్వామి అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అఖిల్‌ను ఎన్టీఆర్ ఇంటర్వ్యూ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనిపై టీమ్ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయినప్పటికీ ఈ ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
లెనిన్ అఖిల్ కెరీర్లో అత్యంత కీలక సినిమాగా భావిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ప్రమోషన్స్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ప్రచార కార్యక్రమంలో కనిపిస్తే సినిమాపై మరింత దృష్టి పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను ప్రశంసిస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
రాయలసీమ నేపథ్యంలోని యాక్షన్, ఎమోషన్, ప్రేమ కథాంశాలతో రూపొందిన లెనిన్ కు మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ ప్రచార కార్యక్రమాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్- అఖిల్ ఇంటర్వ్యూ నిజమైతే, అది సినిమా ప్రీ రిలీజ్ క్యాంపెయిన్‌లో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








