ఫార్ములా ఈ కార్ రేసు కేసులో .. కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు ఏసీబీ కోర్టు (ACB Court) సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvind Kumar), ఏ3 హెచ్ఎమ్డిఎ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి (BLN Reddy), ఏ4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు కు సమన్లు జారీ అయ్యాయి. జులై 31న విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు మళ్లించినట్లు ఏసీబీ అభియోగపత్రంలో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎలఎన్ రెడ్డిలతో సహా ఎఫఈఓ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి






