మే 30న ర్యాలీలో జీటీఏ ‘పల్లె వంట’ కార్యక్రమం
GTA: గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) ర్యాలీ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిని, రుచులను ప్రతిబింబించేలా “పల్లె వంట” కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ర్యాలీలో ఇప్పటివరకు జరగని రీతిలో అతిపెద్ద ఆన్సైట్ కుకింగ్ , పిక్నిక్ ఈవెంట్‌గా దీనిని రూపొందించారు.
వివరాలు..
ఈ వేడుక మే 30, 2026 (శనివారం) నాడు ఉదయం 11:30 గంటల నుండి అపెక్స్ (Apex) లోని వైట్ ఓక్ రిక్రియేషన్ ఏరియా (White Oak Recreation Area) వేదికగా జరగనుంది.
కార్యక్రమ విశేషాలు..
పల్లె రుచులు: అక్కడికక్కడే వంటలు చేసే (Onsite cooking) పోటీలతో పాటు, నోరూరించే తెలంగాణ పల్లె వంటకాల విందు ఉంటుంది.
వినోదం: పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక ఆటలు, వినోదాత్మక కార్యక్రమాలు, అలరించే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్స్: ఈవెంట్, వెండర్ స్టాల్స్, కుకింగ్ పోటీలు , సాంస్కృతిక ప్రదర్శనల కోసం వేర్వేరుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు.
ప్రవేశ రుసుము: ఫ్యామిలీకి $35, సింగిల్‌కి $15 గా నిర్ణయించారు.
నిర్వహణ..
GTA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రవీందర్ గడ్డంపల్లి (నేషనల్ ప్రెసిడెంట్-ఎలెక్ట్), శ్రీనివాస్ నగానబోయిన (ప్రెసిడెంట్/PR), రాజనీకర్ దాసరి (ప్రెసిడెంట్-ఎలెక్ట్) ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చైతన్య కొల్లూరి, రామసుశీల్ పాదురి, శ్రీనాథ్ అమిరెడ్డి , ఇతర సభ్యులు ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.
వెండర్ స్టాల్స్ , ఇతర వివరాల కోసం శ్రీనివాస్ నగానబోయిన (+1 919-917-8128) లేదా రామసుశీల్ పాదురి (+1 919-349-1838) ను సంప్రదించవచ్చు. తెలంగాణ వారసత్వాన్ని చాటిచెప్పే ఈ “పల్లె వంట” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి






