నాడు కియా.. నేడు ఎయిర్ క్రాఫ్ట్, సీమ చరిత్రలో సరికొత్త అడుగు..!
రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేలా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ మెగా ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. భారత దేశపు అత్యంత ప్రతిష్టాత్మక ఐదో తరం (5th Generation) యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి హైటెక్ రక్షణ పరిశ్రమలను తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం సాధించిన ఒక అతిపెద్ద విజయంగా ఈ ప్రాజెక్టును అభివర్ణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ రక్షణ ప్రమాణాలతో నిర్మించబోతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.15,803 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మెగా ఇండస్ట్రీ ఏర్పాటు ద్వారా రాయలసీమ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 7,500 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నత స్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది ఈ ప్రాంతపు ఆర్ధిక రూపురేఖలను మార్చడమే కాకుండా, స్థానిక ఐటీ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతోంది.
ఈ అత్యంత ఆధునిక యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO (Defence Research and Development Organisation), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ రాడార్లకు సైతం దొరకని స్టీల్త్ (Stealth) సాంకేతికత కలిగిన యుద్ధ విమానాలను మన పుట్టపర్తి వేదికగా ఇక్కడే డిజైన్ చేసి, అసెంబ్లింగ్ చేయబోతున్నారు. దీనివల్ల గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రముఖంగా నిలవనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కియా మోటార్స్ ద్వారా అనంతపురం జిల్లాకు ఆటోమొబైల్ విప్లవాన్ని తీసుకురాగా, ఇప్పుడు పుట్టపర్తి వేదికగా రక్షణ మరియు ఏరోస్పేస్ (Aerospace) విప్లవానికి తెరలేపారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో పుట్టపర్తి చుట్టుపక్కల వందలాది అనుబంధ చిన్న తరహా పరిశ్రమలు (MSMEs) వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం రక్షణ రంగానికే కాకుండా, ఏపీ పారిశ్రామిక ప్రగతికి ఒక పవర్ఫుల్ బూస్టర్‌లా పనిచేయబోతోంది.
ఇవి కూడా చదవండి






