ఏపీ క్యాబినెట్ భేటీ … పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలిపింది. రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనపై కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంఫ్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ (Biogas ) యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శుద్ధ ఇంధన రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా క్యాబినెట్ చర్యలు తీసుకుంది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆమోదంపై చర్చించింది. కర్నూలు విమానాశ్రయం (Kurnool Airport) పీపీపీ మోడల్లో అభివృద్ధి ప్రతిపాదన చర్చకు వచ్చింది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంఎసఎంఈలకు నిధుల సౌలభ్యానికి ప్రత్యేక ఏర్పాటుపై చర్చించింది. సాగునీటి కాల్వల విస్తరణ, రోడ్లు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి






