మే 31న హ్యూస్టన్ వేదికగా స్వరార్చన.. వైభవంగా ‘వాగ్గేయకారోత్సవం
TCA:తెలుగు భాష, సంస్కృతి, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా.. హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA), స్వరభారతి సంయుక్త ఆధ్వర్యంలో ‘వాగ్గేయకారోత్సవం’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
కార్యక్రమ వివరాలు..
ఈ ఉత్సవం మే 31, 2026 (ఆదివారం) నాడు ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు రిచ్మండ్ లోని శంకర హాల్ (SVBF SOUTH) వేదికగా జరగనుంది. తెలుగు సంగీత సాహిత్యాల్లోని వాగ్గేయకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ రోజంతా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి
సంప్రదించాల్సింది..
ఈ కార్యక్రమ వివరాల కోసం శ్రీదేవి జోశ్యుల, స్నేహ రెడ్డి చిర్ర , సీతారాం అయ్యగారిని సంప్రదించవచ్చు.
కార్యవర్గ వర్గం (2026-27)..
ఈ వేడుకను విజయవంతం చేసేందుకు TCA ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల నేతృత్వంలోని కార్యవర్గ బృందం కృషి చేస్తోంది. ఈ బృందంలో,
ప్రధాన కార్యదర్శి: రామకృష్ణ గోదావర్తి
కోశాధికారి: జయశ్రీ బోండు
- సాంస్కృతిక కార్యదర్శి: స్నేహ రెడ్డి చిర్ర
- క్రీడలు & స్పెషల్ ప్రాజెక్ట్స్: వాణి దుడాల
- వెబ్ & కమ్యూనికేషన్స్: శ్రీ సురెడ్డి
- లిటరరీ కోఆర్డినేటర్: మైథిలి చాగంటి
- గత అధ్యక్షుడు: శ్రీకాంత్ రెడ్డి టి.
ట్రస్టీలు: ఆశాజ్యోతి దేవకి, దామోదర్ జమ్మిలి (DJ), ఉషా రంగరాజ్ తదితరులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
“తెలుగు వారి సాంప్రదాయం – అందరికీ ఆహ్వానం” అంటూ హ్యూస్టన్ తెలుగు సమాజాన్ని ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి






