కేటీఆర్ తో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ
భారత్ లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల అస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ (Hillary McGeechie) బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని నందినగర్ లో జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా (Australia) పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ప్రధానంగా చర్చించారు. తెలంగాణ (Telangana,), ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది. భారత్ (India), ఆస్ట్రేలియా మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగాయి. ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన ఈ భేటీ పల్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.






