ఇందులేఖ బ్రింగా హెయిర్ సీరమ్ సంచలనం.. 90 రోజుల్లో 11 వేల కొత్త వెంట్రుకల పెరుగుదల
Indulekha Bringh:జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి ఆయుర్వేద శక్తితో పరిష్కారం చూపుతున్న ‘ఇందులేఖ’ బ్రాండ్, తన బ్రింగా హెయిర్ గ్రోత్ సీరమ్‌పై నిర్వహించిన రెండో దశ భారీ క్లినికల్ పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేసింది. 90 రోజుల్లోనే ఆశించిన ఫలితాలను ఇస్తుందని ఈ అధ్యయనం ద్వారా శాస్త్రీయంగా వెల్లడైంది.
ఇవి కూడా చదవండి
పరిశోధనలో తేలిన అంశాలు..
వరుసగా 2024, 2025 సంవత్సరాల్లో నిపుణుల పర్యవేక్షణలో జరిగిన ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా కీలక ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
వేగవంతమైన పెరుగుదల..
ఈ సీరమ్ వాడిన 90 రోజుల్లోనే సుమారు 11,000 కంటే ఎక్కువ కొత్త వెంట్రుకలు మొలిచినట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మార్కెట్లో లభించే 3% రెడెన్సిల్ (Redensyl) ఉత్పత్తులతో పోలిస్తే, ఇందులేఖ సీరమ్ రెండు రెట్లు మెరుగ్గా జుట్టును పెంచుతుందని నిరూపితమైంది. జుట్టు పెరుగుదల చక్రంలో 74% సానుకూల మార్పు రావడం వల్ల, జుట్టు రాలడం తగ్గి సాంద్రత పెరిగినట్లు తేలింది.
నమ్మకాన్ని పెంచడమే తమ లక్ష్యం..
యూనిలీవర్ హెయిర్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సాయిరామ్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ప్రాచీన ఆయుర్వేద సూత్రాలకు ఆధునిక సైన్స్‌ను జోడించడం ద్వారా వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. స్వతంత్ర సంస్థల ద్వారా నిర్వహించిన ఈ ట్రయల్స్, ఈ ఉత్పత్తి పారదర్శకతను, పనితీరును చాటిచెబుతున్నాయని ఆయన వివరించారు.
వినియోగదారుల అనుభవం..
20 నుండి 45 ఏళ్ల వయస్సు గల భారతీయులపై జరిపిన ఈ పరీక్షల్లో 100% మంది తమ జుట్టు మునుపటి కంటే ఒత్తుగా మారిందని అభిప్రాయపడ్డారు. అలాగే 97% మంది వినియోగదారులు జుట్టు రాలడం తగ్గడంతో పాటు, హెయిర్ వాల్యూమ్ పెరగడాన్ని గమనించారు.
భారతీయ జుట్టు స్వభావానికి అనుగుణంగా..
ఈ అధ్యయనాలన్నీ భారతీయ వాతావరణం, ఇక్కడి ప్రజల జుట్టు స్వభావాన్ని బట్టి నిర్వహించడం విశేషం. తాజా ఫలితాలను ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ డెర్మటాలజీ’లో ప్రచురించనున్నారు. ఆయుర్వేద ఫార్ములేషన్లను కేవలం సంప్రదాయంగానే కాకుండా, సైన్స్ ఆధారితంగా నిరూపించడంలో ఇందులేఖ తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటోంది.
ఇవి కూడా చదవండి








